ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిశీలించినట్లయితే,అల్పపీడనం శ్రీలంక,తమిళనాడు తీరాలను ఆనుకొని ఉంది.ముఖ్యంగా ఈరోజు రాత్రికి నెల్లూరు-చెన్నై మధ్య ఈశాన్య రుతుపవన గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది.దీనివల్ల నెల్లూరు-చెన్నై మధ్య భారీవర్షాలు కురుస్తాయి...
ఇక మన రేపల్లె డివిజన్ కి వస్తే,ఈ ఈశాన్య రుతుపవన గాలులు ఉదయం మాదిరి కాకుండా మన సముద్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నాయి...ఫలితంగా ఈరోజు కంటే రేపు సరాసరిగా తక్కువ వర్షాలు ఉంటాయి,కానీ తీర ప్రాంత గ్రామాలైన లంకెవానిదిబ్బ,చోడాయపాలెం,దిండి వైపు, అలాగే దివిసీమలో ఏటిమొగ,హంసలదీవి వైపు వర్షాలు ఉండే అవకాశం ఉంది.
No comments:
Post a Comment