మొన్న, వచ్చే వారం రోజులు కృష్ణా డెల్టా,రేపల్లెడివిజన్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అని చెప్పటం జరిగింది.నిన్న అమర్తలూరు మండలం మూల్పూరు సమీపంలో వర్షం పడింది.ఈరోజు కూడా సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తులో గాలిలో తేమ ఉండటం వలన మేఘాలు ఏర్పడుతున్నాయి.దీని వలన ఈరోజు,రేపు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయి.భారీ అతిభారీ వర్షాలంటూ ఏమీ ఉండవు.ఇక వచ్చే నెల డిసెంబర్ మొదటివారాంతంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉంది.
No comments:
Post a Comment