వెదర్ మోడల్స్ డిసెంబర్ 7-8తేదీలలో మాండస్ తుఫాన్ ను ఏర్పడటాన్ని సూచిస్తున్నాయి. ఇంకా వారం రోజుల సమయం ఉందికాబట్టి, తుఫాన్ గా మారటం,దాని పయనించే మార్గం గురించి ఇప్పుడే ఒక క్లారిటీకి రాలేము.ఇకపోతే చలిగాలులు తగ్గి తూర్పు దిశనుండి తేమగాలులు వీస్తుండటం వల్ల 1,2,3తేదీలలో కృష్ణాడెల్టా,రేపల్లె డివిజన్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు చూడవచ్చు.ఇక 4,5,6 తేదీలలో మళ్ళీ చలి గాలులు,6 వతేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒకవేళ అల్పపీడనం తుఫాన్ గా మారితే దాని ప్రభావం7,8,9 తేదీలలో ఉంటుంది.ఇది వచ్చే వారం రోజులు కృష్ణాడెల్టాలో ఉండబోయే వాతావరణ సారాంశం.
No comments:
Post a Comment