Monday, December 5, 2022

Weather Update 05-12-2022

 ముందు పోస్ట్ లో తెలీయజేసినట్లుగానే అనుకున్నదానికంటె ఒకరోజు ముందుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.ఇది రేపటి వాయుగుండంగా,7,8,9 తేదీలలో తుఫానుగా మారటానికి 80-90% సంభావ్యత ఉంది.కొన్ని వెదర్ మోడల్స్ దక్షిణకోస్తాంధ్ర వైపుకి,మరికొన్ని వెదర్ మోడల్స్ ఉత్తర తమిళనాడు తీరం వైపు తుఫాను కదులుతుందని చూపిస్తున్నాయి.కామన్ గా అన్ని వెదర్ మోడల్స్ మాత్రం శ్రీలంక సమీపంలోకి రావటాన్ని సూచిస్తున్నాయి.కాబట్టి ఖచ్చిత మార్గం కోసం తుఫాన్ ఏర్పడే దాకా వేచిచూడాలి. దీనిప్రభావంతో రేపల్లె డివిజన్,కృష్ణాడెల్టాలో 8-12మధ్య వర్షాలు ఉండే అవకాశం ఉంది.కాబట్టి రైతన్నలు మారుతున్న వాతావరణ పరిస్థితులు కనిపెట్టి ఉండటం మంచిది.







No comments:

Post a Comment