Saturday, December 24, 2022

Temperature Details 24/12/2022

 ఈ సంవత్సరం శీతాకాలంలో కృష్ణాడెల్టాలోనే అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం కావూరు,చెరుకుపల్లి...ఈరోజు ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 15.4సెం° నమోదయ్యింది.



Tuesday, December 20, 2022

Weather Update 20/12/2022

 దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల డిసెంబర్ 25-28తేదీలలో చెదురుముదురు జల్లులు కురిసే అవకాశం ఉంది.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిశీలించినట్లయితే, ఉత్తర భారతం నుండి వస్తున్న పొడిగాలులు ,సముద్రం నుండి వస్తున్న తేమ గాలులను  Dominate చేస్తున్నాయి(1st Image)...ఈ పరిస్థితి 25వ తేదీ వరకు కొనసాగి, ఆ తర్వాత మూడు రోజులు తేమగాలులు Dominate చేసే అవకాశం ఉండటంతో(2nd image) పైన చెప్పిన విధంగా 25-28మధ్య చెదురుముదురు వానలు ఉంటాయి.ఈ వానలు స్వల్పంగా,కొన్ని చోట్ల మాత్రమే పరిమితమవుతాయి.పంటకు నష్టం కలిగించే విధంగా భారీవర్షాలు ఉండవు. 




Saturday, December 10, 2022

Krishna Delta Spatial Maps 11/12/2022

రేపల్లె డివిజన్ మరియు కృష్ణాడెల్టాలో ప్రాంతాల వారీగా నిన్న కురిసిన వర్షపాతం వివరాలను టేబుల్ రూపంలో మరియు మ్యాప్ రూపంలో ఇవ్వటం జరిగింది.
మాండస్ తుఫాను తీరం దాటినా,తుఫాన్ పుల్ ఎఫెక్ట్ వల్ల మరో రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయి.మళ్ళీ 14-15తేదీలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.కాబట్టి అన్నదాతలు మారుతున్న వాతావరణాన్ని కనిపెట్టుకొని ఉండటం మంచిది.


Krishna Delta Spatial Maps 10/12/2022

 


Friday, December 9, 2022

Weather update 09/12/2022

 ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ఇమేజ్లో పొందుపరచటం జరిగింది.నిన్న తీవ్రతుఫాను పరిసరాల్లో గంటకు110కిమీ వేగంతో వీస్తున్న గాలులు నేటి మధ్యాహ్నానికి గంటకు90కిమీ వేగానికి బలహీనపడింది.ప్రస్తుత తీవ్రతుఫాను మధ్యాహ్నం ఒంటిగంటకు చెన్నైకి దక్షిణాగ్నేయంగా 232కిమీ దూరంలో కేంద్రీకృతం అయ్యిఉంది.రాత్రికి ఇది తీవ్రతుఫాను నుండి తుఫానుగా బలహీనపడి,తీరం దాటనుంది.



Krishna Delta Spatial Maps 09/12/2022

Tuesday, December 6, 2022

Weather Update 06-12-2022

8-12తేదీల మధ్యలో తుఫాన్ ఫలితంగా కృష్ణాడెల్టాలో ప్రభావితమయ్యే ప్రాంతాల forecast ను ఇవ్వటం జరిగింది.

వాయుగుండంగా బలపడి భారత్ వైపు కదులుతున్న అల్పపీడనం

 

Krishna Delta Spatial Maps 06-12-2022


 

Monday, December 5, 2022

Krishna Delta Spatial Maps 05-12-2022

 


Weather Update 05-12-2022

 ముందు పోస్ట్ లో తెలీయజేసినట్లుగానే అనుకున్నదానికంటె ఒకరోజు ముందుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.ఇది రేపటి వాయుగుండంగా,7,8,9 తేదీలలో తుఫానుగా మారటానికి 80-90% సంభావ్యత ఉంది.కొన్ని వెదర్ మోడల్స్ దక్షిణకోస్తాంధ్ర వైపుకి,మరికొన్ని వెదర్ మోడల్స్ ఉత్తర తమిళనాడు తీరం వైపు తుఫాను కదులుతుందని చూపిస్తున్నాయి.కామన్ గా అన్ని వెదర్ మోడల్స్ మాత్రం శ్రీలంక సమీపంలోకి రావటాన్ని సూచిస్తున్నాయి.కాబట్టి ఖచ్చిత మార్గం కోసం తుఫాన్ ఏర్పడే దాకా వేచిచూడాలి. దీనిప్రభావంతో రేపల్లె డివిజన్,కృష్ణాడెల్టాలో 8-12మధ్య వర్షాలు ఉండే అవకాశం ఉంది.కాబట్టి రైతన్నలు మారుతున్న వాతావరణ పరిస్థితులు కనిపెట్టి ఉండటం మంచిది.