Monday, October 31, 2022

Repalle Division & Krishna Delta Spatial Maps 31-10-2022

Weather Update 31/10/2022

నాలుగు రోజుల క్రిందట నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు ఈశాన్య రుతుపవనాల రాక గురించి చెప్పటం జరిగింది. అనుకున్నట్టుగానే ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి...ప్రస్తుతం తమిళనాడు,తిరుపతి జిల్లా తీరాల సమీపంలో గాలుల సంగమం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి...

ఇక ఏర్పడిన అల్పపీడనం వల్ల వచ్చే 2-3రోజులు రేపల్లె డివిజన్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి...సముద్రతీర మండలాలైన నిజాంపట్నం,రేపల్లె,నాగాయలంక,కోడూరు మండలాలు ,గాలుల సంగమానికి(Wind convergence zone)దగ్గర్లో ఉన్నాయి కాబట్టి వర్షాలు కొంచెం ఎక్కువ ఉండె అవకాశం ఉంది.* 

Sunday, October 23, 2022

Krishna Delta Spatial Maps 23-10-2022

 

Weather update 23-10-2022

 మొన్న 20వతేదీ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన విషయం విదితమే...ఈ అల్పపీడనం బలపడి ప్రస్తుతం వాయుగుండంగా,తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది...వెదర్ మోడల్స్ ప్రకారం ఈ వాయుగుండం వచ్చే 48గంటల్లో తుఫాన్ గా బలపడి ,ఉత్తరదిశగా పయనిస్తూ,పశ్చిమబెంగాల్,బంగ్లాదేశ్ వైపు తీరందాటే అవకాశం ఉంది...



ఈ తుఫాన్ మనకు దూరంగా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం మనపై శూన్యం.కాకపోతే ఈ తుఫాన్ వెళ్తూ,వెళ్తూ ఉత్తర భారతదేశం నుండి చలిగాలులను మనవైపుకు లాగుతుండటంతో, వచ్చే వారం రోజులు పగలు ఎండ,రాత్రుళ్ళు కనిష్ట ఉష్ణోగ్రతలు,పొగమంచు నమోదవుతాయి.వర్షాలు అతితక్కువగా ఉంటాయి...       ఇక నైరుతి రుతుపవనాల తిరోగమనం నిన్నటితో ఉత్తరాంధ్ర,తూర్పుగోదావరిలోని కొన్ని భాగాల నుండి నిష్క్రమించాయి.

Saturday, October 8, 2022

Krishna Delta Spatial Maps 09-10-2022

నిన్న మధ్యాహ్నం కనగాల పరిసరాల్లో కురిసిన 113.8మిల్లీమీటర్ల వర్షపాతం,నిన్న రాష్ట్రంలోనే అత్యధికం(Kanagala is the State Highest Rainfall recorded place on yesterday )...

శనివారం ఉదయం 8:30ని.ల నుండి ఆదివారం ఉదయం 8:30ని.ల వరకు రేపల్లెడివిజన్లో నమోదైన వర్షపాతం వివరాలు...
1)కనగాల,చెరుకుపల్లి-113.8మిల్లీమీటర్లు
2)ఇసుకపల్లె,రేపల్లె-62.5మిమీ
3)గూడవల్లి,రేపల్లె-43.5మిమీ
4)నగరం-42.5మిమీ
5)132/33కెవి సబ్ స్టేషన్,రేపల్లె టౌన్-38.5మిమీ
6)అమర్తలూరు-35.8మిమీ
7)చెరుకుపల్లి-32మిమీ
8)కిడ్వాయి స్కూల్ గ్రౌండ్,రేపల్లె టౌన్-30.5మిమీ
9)మృత్యుంజయపాలెం-17.5మిమీ
10)కూచినపూడి,నిజాంపట్నం-16.25మిమీ
11)కొల్లూరు-14.3మిమీ
12)మూల్పూరు,అమర్తలూరు-14మిమీ 
13)చుండూరు-12మిమీ
14)నిజాంపట్నం-8.5మిమీ
15)భట్టిప్రోలు-4మిమీ
16)వేమూరు-2.1మిమీ

Krishna Delta Spatial Maps 08-10-2022

 

Thursday, October 6, 2022

Weather update 06-10-2022

ఈరోజు ఉదయం దాకా ప్రకాశంజిల్లా తీరం సమీపంలో ఉన్న అల్పపీడనం దక్షిణ తెలంగాణ వైపుగా కదిలినప్పటికీ,ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ రెండు అల్పపీడనాలను ఆనుకొని ద్రోణి ప్రకాశం,బాపట్ల,దక్షిణ తెలంగాణ మీదుగా కొనసాగుతున్నది.ఈ ద్రోణి ప్రభావంతో మనకు రేపు,ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు ఉంటాయి...రాబోయే అల్పపీడనం కోస్తాతీరం వైపు వచ్చాక మళ్ళీ మోస్తరు నుండి భారీవర్షాలు మొదలవుతాయి.
ఇక ఈశాన్యరుతుపవనాలు ఈ అక్టోబర్ మూడోవారంలో మనల్ని తాకే అవకాశం ఉంది.ప్రస్తుతం పైన పిక్చర్లో చూపించినట్లుగా,దేశంలో జమ్మూకాశ్మీర్,పంజాబ్,హర్యనా,రాజస్థాన్,గుజరాత్ రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల నిష్ర్కమణ జరిగింది. 


Sunday, October 2, 2022

Krishna Delta Spatial Maps 02-10-2022

 


నిన్న కృష్ణా డెల్టాలో చల్లపల్లి,అవనిగడ్డ,కొల్లూరు,వేమూరు,భట్టిప్రోలు,రేపల్లె,మోపిదేవి,అమర్తలూరు మండలాలలో మోస్తరు నుండి భారీవర్షం కురవగా, మిగిలిన ప్రాంతాల్లో చిన్నపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది...అత్యధికంగా చల్లపల్లిలో 98.6మిమీ వర్షపాతం కురిసింది...