వెదర్ మోడల్స్ డిసెంబర్ 7-8తేదీలలో మాండస్ తుఫాన్ ను ఏర్పడటాన్ని సూచిస్తున్నాయి. ఇంకా వారం రోజుల సమయం ఉందికాబట్టి, తుఫాన్ గా మారటం,దాని పయనించే మార్గం గురించి ఇప్పుడే ఒక క్లారిటీకి రాలేము.ఇకపోతే చలిగాలులు తగ్గి తూర్పు దిశనుండి తేమగాలులు వీస్తుండటం వల్ల 1,2,3తేదీలలో కృష్ణాడెల్టా,రేపల్లె డివిజన్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు చూడవచ్చు.ఇక 4,5,6 తేదీలలో మళ్ళీ చలి గాలులు,6 వతేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒకవేళ అల్పపీడనం తుఫాన్ గా మారితే దాని ప్రభావం7,8,9 తేదీలలో ఉంటుంది.ఇది వచ్చే వారం రోజులు కృష్ణాడెల్టాలో ఉండబోయే వాతావరణ సారాంశం.
Wednesday, November 30, 2022
Friday, November 25, 2022
Weather update 25-11-2022
మొన్న, వచ్చే వారం రోజులు కృష్ణా డెల్టా,రేపల్లెడివిజన్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అని చెప్పటం జరిగింది.నిన్న అమర్తలూరు మండలం మూల్పూరు సమీపంలో వర్షం పడింది.ఈరోజు కూడా సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తులో గాలిలో తేమ ఉండటం వలన మేఘాలు ఏర్పడుతున్నాయి.దీని వలన ఈరోజు,రేపు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయి.భారీ అతిభారీ వర్షాలంటూ ఏమీ ఉండవు.ఇక వచ్చే నెల డిసెంబర్ మొదటివారాంతంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉంది.
Wednesday, November 23, 2022
Weather Update 23-11-2022
బంగాళాఖాతంలోని అల్పపీడనం తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సమీపంలో తీరం దాటి,బలహీనపడిపోయింది.దీని ప్రభావంతో తిరుపతి,నెల్లూరుజిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.ఈ అల్పపీడనం ఆది నుండి బలహీనంగా ఉండటంతో కృష్ణాడెల్టా మరియు రేపల్లె డివిజన్లో ఎక్కువ వర్షాలు కురవలేదు.ఇక వచ్చే వారం రోజులు అక్కడక్కడ చినుకులు తప్ప పెద్ద ముప్పేమీలేదు.కాకపోతే చలిగాలుల ప్రభావం పెరగనుంది.
Monday, November 21, 2022
Rainfall Details 21-11-2022
21-22తేదీలలో రేపల్లె డివిజన్,కృష్ణా డెల్టాలో వర్షాలు కురుస్తాయని తెలపటం జరిగింది.అనుకున్నట్టుగానే ఈరోజు తెల్లవారుఝామున వర్షాలు కురిశాయి.
రేపల్లె డివిజన్ మరియు కృష్ణా డెల్టాలో ఈరోజు ఉదయం కురిసిన వర్షపాతం వివరాలు Image లో ఇవ్వటం జరిగింది.
Sunday, November 20, 2022
Weather Update 20-11-2022
బంగాళాఖాతంలోని అల్పపీడనం సముద్రం నుండి తేమగాలులను కోస్తాంధ్ర వైపునకు నెడుతుంది(Low pressure pushing Moist winds from Sea).ప్రస్తుతం మనకు ఉన్న పొడిగాలుల వాతావరణం కాస్తా,అల్పపీడనం వల్ల వస్తున్న తేమగాలులు ఆక్రమిస్తాయి(Dry winds will be replaced by Moist winds).ఈ Phenomemna ను ఇమేజ్లో చూపించడం జరిగింది.తేమగాలులు ఆక్రమణ తదనంతరం మనకు వర్షాలు కురుస్తాయి.ముఖ్యంగా సముద్ర తీర గ్రామాల్లో ఈ వర్షాలు ఎక్కువ ఉంటాయి.ఇప్పటికే మనం కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతం ఉండటం గమనించవచ్చు.
Thursday, November 17, 2022
Weather update 17-11-2022
నిన్న ఉపరితల ఆవర్తనం పుల్ ఎఫెక్ట్(pull effect) వల్ల 4రోజులు చలి తీవ్రత ఉంటుందని చెప్పటం జరిగింది.ఈరోజు ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి,దక్షిణకోస్తాంధ్ర వైపు కదులుతుంది.అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల తర్వాత కోస్తాంధ్రలో చలితీవ్రత తగ్గి,21-22 తేదీలలో రేపల్లెడివిజన్,కృష్ణాడెల్టాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆ తర్వాత మళ్ళీ చలి తీవ్రత ఉంటుంది.
గడిచిన 24 గంటల్లో కొల్లిపర-17°C,కావూరు-17.6°C,గూడవల్లి-18°C,రేపల్లె-19.°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Wednesday, November 16, 2022
Weather Update 16/11/2022
ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం యొక్క పుల్ ఎఫెక్ట్(pull Effect) వల్ల కృష్ణాడెల్టాలోని పలు ప్రాంతాల్లో వచ్చే 4రోజులు పొగమంచు ప్రభావం ఉంటుంది.కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉంది.గడిచిన 24 గంటల్లో రేపల్లె డివిజన్లో కావూరు-18.5°C, రేపల్లె-19.4°C,గూడవల్లి-19.4°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sunday, November 13, 2022
Saturday, November 12, 2022
Thursday, November 10, 2022
Weather update 10-11-2022
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను సాధ్యమైనంత వరకు Image లో రిప్రజెంటేషన్ చెయ్యటం జరిగింది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం వల్ల రేపల్లె డివిజన్లో కానీ కృష్ణా డెల్టాలో గాని భారీవర్షాలు ఉండవు.కేవలం 12-14తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అది కూడా సముద్ర తీర గ్రామాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకు సంకేతంగా ఈరోజు మనకు కొన్నిచోట్ల కారుమబ్బులు కనిపించాయి.
Monday, November 7, 2022
Weather update 07-11-2022
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో,ఈ వారాంతం చివర్లో(శని,ఆదివారం) మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది...అప్పటివరకు ఉత్తర భారతదేశం నుండి చలిగాలులు వీస్తుండటంతో,మనపై చలి ప్రభావం ఉంటుంది,ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి.
Wednesday, November 2, 2022
Weather update 02/11/2022
Tuesday, November 1, 2022
Weather Update 01/11/2022
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిశీలించినట్లయితే,అల్పపీడనం శ్రీలంక,తమిళనాడు తీరాలను ఆనుకొని ఉంది.ముఖ్యంగా ఈరోజు రాత్రికి నెల్లూరు-చెన్నై మధ్య ఈశాన్య రుతుపవన గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది.దీనివల్ల నెల్లూరు-చెన్నై మధ్య భారీవర్షాలు కురుస్తాయి...